Ganta Srinivasa Rao: రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు స్పందన.. జగన్‌లో భయం, అనుమానం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం హాట్‌టాపిక్‌గా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లో పెట్టిన స్పీకర్.. ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు.. అయితే, తన రాజీనామా ఆమోదంపై తొలిసారి స్పందించారు ఘంటా శ్రీనివాసరావు.. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఆమోదిస్తారా..? అని ప్రశ్నించారు. ఈ ఘటనతో సీఎం వైఎస్ జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోంది. జగన్‌ది రాజకీయ దివాళాకోరు తనమే. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు నన్ను సంప్రదించకుండానే ఆమోదించారు. గతంలో నేను స్పీకర్‌ను కలిసినప్పుడు ఆమోదించకుండా.. ఇప్పుడు ఆమోదించడమేంటీ..? అని నిలదీశారు.
Read Also: Rukmini Vasanth: సప్త సాగరాలు దాటి టాలీవుడ్’కి వచ్చేస్తోంది.. మొదటి సినిమా ఫిక్స్!
Also Read
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
సీఎం జగన్‌లో రాజ్యసభ సీట్ల భయం కన్పిస్తోంది.. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారవి ఆయనకు అనుమానంగా ఉన్నట్టుందన్నారు గంటా శ్రీనివాసరావు.. అయితే, రాజ్యసభ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తా అన్నారు. అరాచకం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో నేను ఓటేయాలనుకున్నా.. కానీ, రాజీనామాతో నన్ను ఓటింగ్‌కు దూరం చేయాలని చూస్తున్నారు. అయినా, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా నాకున్న మార్గాలేంటి? అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటాను అన్నారు. తాను ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే అని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!