Site icon NTV Telugu

Ganja In Hyderabad: బరితెగించేశారుగా.. యదేచ్చగా గంజాయి ని కిరాణం స్టోర్ లో అమ్మేస్తున్నారుగా..?!

5

5

ఈ మధ్యకాలంలో గంజాయి అమ్మకం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువైనవని చెప్పవచ్చు. చాలాచోట్ల అనేకమంది గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుందని దాంతో పోలీస్ బాస్ లు అనేక చోట్ల దాడులు నిర్వహించి గంజాయి అమ్మే వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా హైదరాబాద్ నడిబడ్డలో ఓ కిరణం షాప్ లో గంజాయి విక్రయిస్తున్న మహిళలను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు..

Also read: Janga Krishna Murthy: వైసీపీకి షాక్.. నేడు పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా..!

ఎస్ఓటి మాదాపూర్ బృందం గచ్చిబౌలి పరిధిలో ఉంటున్న నానక్ రామ్ గూడ లో తాను నడుపుతున్న కిరాణా దుకాణంలో అనురాధ బాయ్ అనే మహిళ గంజాయి అమ్ముతుందన్న సమాచారంతో పోలీసులు ఆమె దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కిరాణా షాపులో అమ్మకానికి ఉంచిన 300 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి విచారణలో భాగంగా సదరు మహిళ దూల్ పేట్ నుండి గంజాయిని సేకరించి చిన్న చిన్న ప్యాకెట్లు గా తయారుచేసి విద్యార్థులకు కూలీలకు విక్రయిస్తున్నట్లు తెలిపింది.

Also read: Kachchatheevu: కచ్చతీవు ద్వీపంపై రాజకీయ రగడ.. కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం

ఈ రైడ్ లో భాగంగా సదరు మహిళ వద్ద నుండి మొత్తంగా 39 చిన్న గంజాయి ప్యాకెట్లను, అలాగే రూ. 1200 నగదును, ఒక మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version