కరీంనగర్ జిల్లా గ్రంధాలయంలో రీడింగ్ హాల్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్ షో.. డిజిటల్ స్క్రీన్స్ తో ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయని, రెండ్రోజుల పాటు ఈ కార్యక్రమాలు సాగుతాయన్నారు. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సుందరికరణ పనులు కేటీఆర్ ప్రారంభిస్తారని, ఆగస్టు 15 తరువాత మానేరు రివర్ ఫ్రంట్ అందుబాటులోకి వస్తుందన్నారు. గత ఐదేళ్లలో నగరం రూపురేఖలు మార్చేసాము… గొప్పగా అభివృద్ధి చేశాం.. చెప్పిన పనులు పూర్తిచేసామని, నగరంలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి.. ప్రజల శాంతితో ఉన్నారన్నారు. దేశానికి రెండో రాజధాని అంశం ఎన్నికలు రాగానే తెరపైకి వస్తాయన్న మంత్రి గంగుల.. మాది ఢిల్లీ పార్టీ కాదు తెలంగాణ పార్టీ అని వ్యాఖ్యానించారు.
Also Read : Asia Fencing Championship: రికార్డు సృష్టించిన ఫెన్సర్ భవానీ.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం
కాంగ్రెస్ బీజేపీ లకు సమాన దూరంలో ఉన్నామని, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే… హుజురాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయారని, కాంగ్రెస్‌కు అందుకే 3 వేల ఓట్లు వచ్చాయన్నారు. పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ నాలుగేళ్లకు ఒకసారి కనిపిస్తారని, ఎన్నికలు వచ్చినప్పుడే మేమున్నాం అని వస్తారన్నారు. పొన్నం నేను మిత్రులం. రాజకీయాలు వేరు ఫ్రెండ్షిప్ వేరన్నారు. బండి సంజయ్ నేను ఒక్కటీ ఎలా అవుతామని, అభివృద్ధిలో బండి సంజయ్, పొన్నం మాతో పోటీ పడండన్నారు. బండి సంజయ్ 2019 కంటే ముందు నాపై అనేక ఆరోపణలు చేశారని, అవన్నీ ఫాల్స్ అని తెలిపోయాయన్నారు.
Also Read : Asia Fencing Championship: రికార్డు సృష్టించిన ఫెన్సర్ భవానీ.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం
బండి సంజయ్ పొన్నం ఇద్దరు కలిసి నా మీద కోర్టుకు వెళ్లారని, వాళ్లిద్దరూ ఒకటి అనేది ఇది ఆధారమన్నారు. ‘కేసీఆర్ ని విమర్శిస్తే అసలే ఊరుకోము… పొన్నం ప్రభాకర్ ఔట్ డేటెడ్.. లీడర్.. తెలంగాణ సంస్కృతి లో సాంస్కృతిక కార్యక్రమాలు తప్పక ఉంటాయి… గాన బజానా కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఉంటది.. కరీంనగర్ లో మాకు 60శాతం పాజిటివ్ ఉంది.. బీజేపీ.కాంగ్రెస్ సెకండ్ స్థానం కోసం కొట్లాడాలి. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో కాంగ్రెస్ ని సర్వనాశనం చేసాడు.. తన వార్డులో కూడా కాంగ్రెస్ ని గెలిపించుకోలేదు.. బండి సంజయ్ తో పొన్నం కుమ్మక్కు అయ్యారు.. రైతులకు పరిహారం త్వరలో అందుతుంది… ఒక్క రూపాయి కూడా ధాన్యం డబ్బులు బాకీ లేదు..’ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.