గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్న కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. శేషన్నను నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసలు పిటిషన్ వేశారు. అయితే.. నయీం అక్రమాలలో శేషన్న పాత్రపై విచారించాలన్న పోలీసులు.. శేషన్న ఆధీనంలోని యాక్షన్ టీం ఎక్కడ? ఎంతమంది? అన విచారించనున్నారు. నయింకు ఏకే47 ఎలా వచ్చిందో శేషన్నకే తెల్సే అవకాశం ఉందని, ఇంకా లెక్కతేలని అక్రమాలు చాలా ఉన్నాయని పోలీసులు అంటున్నారు. శేషన్న రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగు వస్తున్నాయి. మొత్తం పది కేసుల్లో శేషన్న నిందితుడు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత ఆరున్నర సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న శేషన్న.. నయీం ప్రధాన అనుచరుడు ప్రమాదకరమైన వ్యక్తి. అనేక షెల్టర్స్ ఉన్నాయి. పారిపోయే ప్రమాదం ఉంది. అనేక నేరాలకు పాల్పడ్డాడు.. ఆయుధాలు చూపించి బెదిరిస్తాడు. ఐపీఎస్ వ్యాస్ , కొనపురి రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్రీధర్ రెడ్డి , కనకాచారి టీచర్, రాములు హత్య కేసులో శేషన్న నిందితుడు.
పలు అక్రమ ఆయుధాల కేసులో సైతం నిందితుడు. విద్యార్ధి దశలోనే నక్సలైట్ ఉద్యమంలో చేరిన శేషన్న.. తాడా కేసులో గతంలో అరెస్ట్ అయ్యాడు. నయీంతో జైల్లో పరిచయం ఏర్పడింది. ఆతర్వాత వరుస హత్యలు, అక్రమాలకు పాల్పడ్డాడు. గ్యాంగ్ స్టార్ నయీంతో కలిసి అనేక నేరాలకు పాల్పడిన శేషన్న.. 15 మంది నక్సల్ కమాండర్స్‌తో పని చేశాడు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులతో శేషన్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మావోయిస్టులకు కొరియర్ గా, డెన్ కీపర్‌గా శేషన్న పనిచేశాడు. శేషన్న పై పలు కిడ్నాప్, మర్డర్, ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు ఉన్నాయి. శేషన్న వద్ద నుండి 9ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.