Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangamma Lockup Death Case: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ ఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా దుర్గప్పకు అందించిన వైద్య చికిత్సకు సంబంధించిన అన్ని నివేదికలను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సీల్డ్ కవర్లో ధర్మాసనానికి సమర్పించారు. కోర్టు ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఆమె స్వగ్రామానికి ఇతరులను వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు. అలాగే గంగమ్మ మృతదేహానికి రీ-పోస్ట్‌మార్టం నిర్వహించాలని కోర్టును కోరారు.
గంగమ్మ మరణానికి గల కారణాలపై ధర్మాసనం ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పోస్టుమార్టం నివేదికలో గంగమ్మ ఎలా మరణించిందని పేర్కొన్నారో వివరాలు కోరింది. గంగమ్మ శరీరంపై గాయాలు ఉన్న విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది, కార్డియాక్ అరెస్ట్‌తో పాటు ఇతర కారణాల వల్ల గంగమ్మ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. అదే సమయంలో వీరేంద్ర కేసులో గంగమ్మ కుమార్తె లక్ష్మి ఎ-3 నిందితురాలిగా ఉన్నారని, అయితే ఇప్పటివరకు ఆమెను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో లక్ష్మికి తగిన రక్షణ కల్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. కేసు దర్యాప్తు, విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Also Read
- Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
- Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
తాజావార్తలు
-
Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
-
Hyderabad Water Alert : హైదరాబాద్ వాసులకు తాగునీటి ముప్పు..!
-
Bellam Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! 10 నిమిషాల్లో హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు’.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేయొచ్చు!
-
Ashirvad Sooryavanshi: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆశీర్వాద్ సూర్యవంశీ వీర విహారం.. మురిసిపోయిన వైభవ్..
-
ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!