హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మీర్పేట్ వద్ద ఓ విదేశీ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, ఆమెను తీసుకెళ్లిన ముగ్గురు యువకులు పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడ ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు జర్మనీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఆమె ఫిర్యాదులో తనపై ముగ్గురు యువకులు దాడి చేశారని వివరించారు. పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన నగరంలో మహిళా భద్రతపై మరోసారి ఆందోళనను రేకెత్తించింది.
READ MORE: BV Raghavulu : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో బీవీ రాఘవులు