NTV Telugu Site icon

Gang Rape : కామపిశాచులకు కేరాఫ్‌.. మతిస్థిమితం లేని మహిళను సైతం వదలని మృగాళ్లు

Rape

Rape

Gang Rape : ఇటీవల అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతుండటం అత్యంత ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఏ వయస్సు వారినైనా లక్ష్యంగా చేసుకుని దుర్మార్గులు తమ కీచక కోరికలు తీర్చుకుంటున్నారు. పాఠశాలలు, కార్యాలయాలు, కూడా మహిళలకు సురక్షిత ప్రదేశాలుగా మారలేని పరిస్థితి ఏర్పడింది. బాలికలు కూడా ఈ దారుణాలకు గురవుతుండటం గమనార్హం. ఇటీవల అనేక స్కూల్ విద్యార్థినులు వారి బంధువుల చేతుల్లోనే అత్యాచారానికి గురవుతున్న దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

TTD: తిరుమలలో ఎట్టకేలకు ముగిసిన వివాదం..

గ్రామాలు, పట్టణాలు, మెట్రో నగరాలు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్లపైన, కార్యాలయాల్లో, అద్దె ఇళ్లలో, విద్యాసంస్థల్లో కూడా ఈ తరహా నేరాలు పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తుంది. రోజుకు ఎన్నో అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. కానీ, వాటిలో చాలా తక్కువ శాతం మాత్రమే దోషులను శిక్షించే వరకు వెళ్తున్నాయి. బాధితులపై సమాజం ఒత్తిడి తెచ్చి వాటిని అణిచివేయడం, పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నేరస్థులు మరింత ధైర్యంగా మారుతున్నారు.

మహిళలు రాత్రివేళ బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి. తమకు రక్షణ ఉండదనే భావనతో జీవించాల్సి వస్తోంది. బాలికల తల్లిదండ్రులు వారి పిల్లలను ఒంటరిగా బయటికి పంపడానికి భయపడుతున్నారు. బాధితులకు న్యాయం జరగకపోవడం, కేసులు సంవత్సరాల తరబడి నడవడం వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం తగ్గిపోతుంది. తాజాగా మరో సంఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చోటు చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేని మహిళ పై లైంగిక దాడి పాల్పడ్డారు దుండగులు. మియాపూర్ బొల్లారం x రోడ్ లో మహిళని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళి సామూహిక ఆత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Delhi : గర్భిణీలకు గుడ్ న్యూస్.. రూ. 21,000ఇవ్వనున్న ప్రభుత్వం ?