Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
Read Also:AP Crime: హైదరాబాద్‌లో లవ్.. ఏపీలో ఆత్మహత్య.. ఆ ఒక్కటే కారణం..!
మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో ‘రా మచ్చా మచ్చా’ ట్రెండింగ్ లో ఉంది. డైరెక్టర్ శంకర్ లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించటమే కాకుండా, అభిమానులకు, ప్రేక్షకులకు సినిమా డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంటారు. రామ్ చరణ్‌లాంటి మాస్ హీరో ఉన్నప్పుడు ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాలని మెగాభిమానులు, మూవీ లవర్స్ ‘గేమ్ ఛేంజర్’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also:Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు ప్రత్యక్ష ప్రసారం..
అయితే, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. మమూలుగానే తన సినిమాల్లోని సాంగ్స్‌కు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం డైరెక్టర్ శంకర్ స్పెషాలిటీ అన్న సంగతి తెలిసిందే. కనువిందు చేసే సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్‌తో సగటు ప్రేక్షకుడిని ఆశ్చర్యచకితులను చేయించడం ఆయనకేమీ కొత్త కాదు. గతంలో తన సినిమాల్లో కూడా అలాంటి పాటలను చూసే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ మీద తెరకెక్కించిన ఓ మెలోడి సాంగ్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అదిరిపోయే లొకేషన్స్‌లో హీరోహీరోయిన్ల మధ్య సాగిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.