NTV Telugu Site icon

Gautam Gambhir: 2027 వరల్డ్ కప్ వరకు కష్టమే.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన గంభీర్..!

Gambhir

Gambhir

Gautam Gambhir: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్టార్ బ్యాటర్లు వన్డే ఫార్మెట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఫిట్నెస్ సహకరిస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారు. వారిద్దరిని ఎలాగైనా 2027 ప్రపంచ కప్ లో ఆడించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

Read Also: Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..!

కానీ, అక్కడ గంభీర్ ఉండగా అది సాధ్యపడేలా కనిపించడం లేదు. తాజాగా, గంభీర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళనను పెంచింది. రోహిత్, కోహ్లీ వచ్చే ప్రపంచకప్ వరకు జట్టులో ఉంటారా..? అన్న ప్రశ్నకు గంభీర్ మాట్లాడుతూ.. ఇప్పుడు మేనేజ్మెంట్ దృష్టంతా 2026 టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. వన్డే వరల్డ్ కప్ కు ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Read Also: Honda CB1000 Hornet SP: 999cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ లతో హోండా CB1000 Hornet SP లాంచ్..!

ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీ20 ప్రపంచ కప్‌ పైనే దృష్టి పెట్టబోతున్నామని.. 2027 వన్డే ప్రపంచ కప్ ఇంకా రెండున్నర సంవత్సరాల దూరంలో ఉందని గంభీర్ అన్నాడు. అయితే, మంచి ప్రదర్శనకి వయసుతో సంబంధం లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాగా రోహిత్, కోహ్లీ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. వాళ్ళిద్దరికి అదే చివరి వన్డే మ్యాచ్. ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించింది.