ఇదివరకు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ‘నువ్వు నేను’ సినిమా ఒకటి. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ‘నువ్వు నేను’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొత్త రికార్డ్స్ ను కూడా సృష్టించింది. ఈ సినిమా మొత్తానికి ఉదయ్ కిరణ్ నటన, ఆర్ఫీ పట్నాయక్ అందించిన సంగీతం హైలైట్. ఈ సినిమాలో హీరోయిన్ గా అనిత నటించింది.
Also read: Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ ఎదుట కేజ్రీవాల్, కవిత ముఖాముఖి విచారణ
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందేగా.. ఇందులో భాగంగానే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఎంటర్టైన్మెంట్ చేసాయి. కేవలం సూపర్ హిట్ అయినా సినిమా మాత్రమే కాకుండా., డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రీలీజ్ అయ్యి కలెక్షన్స్ తో అదరగొడుతున్నాయి. ఇదే కోవలోకి ఇప్పుడు ‘నువ్వు నేను’ సినిమా కూడా ఇప్పుడు రీరిలీజ్ అయ్యింది. మొదటిసారి సూపర్ హిట్ అయ్యినప్పుడు ఎలా ఇష్టపడ్డారో.. అలాగే ఇప్పుడు కూడా ఈ సినిమా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.
Also read: Delhi Liquor Scam : 18 నెలల్లో 16 మంది అరెస్ట్.. లిక్కరు కేసులో ఇప్పటివరకు జైలుకు వెళ్లింది ఎవరంటే ?
తాజాగా నువ్వు నేను సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమాని ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. వీటికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాలో ‘గాజువాక పిల్ల’ సాంగ్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ కు ఇప్పటికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే నమ్మండి. తాజాగా సినిమా రీరిలీజ్ కావడంతో ఈ సాంగ్ కు అభిమానులు డాన్స్ దుమ్మురేపారు. ‘గాజువాక పిల్ల’ పాటకు థియేటర్స్ లో డాన్స్ లు వేస్తూ, పాట పాడుతూ ప్రజలు అదరగొట్టారు. ఈ పాటకి సంబంధిచిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.