Gaddar Awards: తగ్గేదేలే.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్.. బెస్ట్ సినిమాగా కల్కి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaddar Awards:తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను నటీనటులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ కమిటీ ఏర్పాటు చేయగా.. తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ఇవాళ అవార్డులను ప్రకటించారు. “అవార్డుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం లేకుండా పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. జ్యూరీ ఏకగ్రీవంగా విజేతలను ఎంపిక చేసిందని జయసుధ తెలిపారు.
Read Also: Gaddar Awards: 14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..!
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
గద్దర్ అవార్డ్స్ 2024 – విజేతలు:
ఉత్తమ సినిమా: కల్కి 2898AD
ఉత్తమ రెండవ సినిమా: పొట్టెల్
ఉత్తమ మూడవ సినిమా: లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: నివేదా థామస్ (35)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం: కమిటీ కుర్రోళ్ళు
ఉత్తమ చిల్డ్రన్స్ సినిమా: 35 ఇది చిన్న కథ కాదు
ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ: రజాకార్
ఉత్తమ డెబ్యూట్ డైరెక్టర్: యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ ప్రజాదరణ సినిమా: ఆయ్
ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్: SJ సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్: సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన – నిజమే చెబుతున్న సాంగ్)
ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్: శ్రేయ ఘోషల్ (పుష్ప 2 – సూసీకి సాంగ్)
ఉత్తమ కమెడియన్: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: మాస్టర్ అరుణ్ దేవ్ (35 ఇది చిన్నకథ కాదు), మాస్టర్ హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ స్టోరీ రైటర్: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ లిరిసిస్ట్: చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాధ్ రెడ్డి (గామి)
ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మీనన్ (గామి)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ మాస్టర్ (దేవర – ఆయుధ పూజ సాంగ్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అధినితిన్ జిహాని చౌదరి (కల్కి)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శీను (రజాకార్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యురి అవార్డు (హీరో): దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యురి అవార్డు (హీరోయిన్): అనన్య నాగళ్ళ (పొట్టెల్)
స్పెషల్ జ్యురి అవార్డు (డైరెక్టర్): సుజీత్, సందీప్ (క)
స్పెషల్ జ్యురి అవార్డు (నిర్మాత): ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి (రాజు యాదవ్)
జ్యురి స్పెషల్ మెన్షన్ (సింగర్): ఫరియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్ – మత్తు వదలరా)
బెస్ట్ బుక్ ఆన్ సినిమా: మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)
Read Also: Demon: భయపెట్టడానికి ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్”..!
తెలంగాణ ప్రభుత్వం చేతుల మీదుగా గద్దర్ గారి పేరుతో అవార్డులు ప్రకటించడం సినీ పరిశ్రమలో గౌరవప్రదమైన అంశంగా మారింది. సినిమాలకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం ద్వారా కళాకారులకు ప్రోత్సాహం అందించే ఈ అవార్డులు, ఇండస్ట్రీలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!