Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోగా, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అధికారులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన కమిషనర్ సృజన.. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి (ఏసీపీ) సంతోష్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ కట్టడాల పట్ల ఆయన ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించారని విచారణలో నిర్ధారించారు.
ఈ ప్రమాదానికి ప్రధాన కారకుడైన బిల్డర్ సాజిద్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఒకప్పుడు సాధారణ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన సాజిద్.. కక్కుర్తి అధికారుల అండదండలతో సైబరాబాద్ ఏరియాలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అత్యంత తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న స్థలాల్లో సైతం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ అంతస్తులు నిర్మించి, వాటిని పీజీ హాస్టల్స్‌గా నిర్వహిస్తూ భారీగా అక్రమ సంపాదనకు తెరలేపాడు. సాజిద్ ఖాన్ అక్రమాలపై తమకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. తాజా ప్రమాదంతో అలర్ట్ అయిన హైడ్రా.. ఇప్పుడు సాజిద్ నిర్మించిన ఇతర అక్రమ కట్టడాలను నేలమట్టం చేసే దిశగా పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మరోవైపు, సాజిద్‌తో నిరంతరం టచ్‌లో ఉంటూ ఆయన సామ్రాజ్యానికి తెరవెనుక సహకరించిన ఇతర టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారుల బాగోతంపై కూడా ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో త్వరలోనే మరికొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తాజావార్తలు
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!