రామ్‌గోపాల్ వర్మ..ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన కెరీర్ ఆరంభం లో అక్కినేని నాగార్జున హీరోగా `శివ` సినిమా ను తెరకెక్కించి ఆయన సృష్టించిన సంచలనాలు ఇప్పటికీ గుర్తుంటాయి.సినిమా మేకింగ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎవరికీ సాధ్యం కాని సరికొత్త మేకింగ్ స్టయిల్‌ని చూపించాడు.విభిన్న రీతిలో సినిమాను తెరకెక్కించి అందరు ఆశ్చర్యపోయేలా చేసారు ఆర్జివి.ఆయన తెరకెక్కించిన `క్షణం క్షణం`, `మనీ`, `సర్కార్` మరియు `రక్త చరిత్ర` వంటి సినిమాలతో ఆయనేంటో చూపించారు.కానీ ఆ తర్వాత వర్మ క్రేజ్ తగ్గిపోయింది.వర్మ సినిమాలు ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం లేదు. అదేసమయంలో తన మేకింగ్‌లో క్వాలిటీ కూడా తగ్గిపోయింది.. ఇప్పుడు వర్మ తెరకెక్కించే సినిమాలు చూస్తుంటే ఆయన సినిమాలను లైట్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది.ప్రస్తుతం వర్మ సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అవుతున్నారు.కానీ ఒక దర్శకుడిగా ఆయన సృష్టించిన సంచలనాలను మాత్రం మేకర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు..
ప్రముఖ దర్శకులు కూడా మూవీ మేకింగ్ విషయంలో వర్మకి ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి.. వర్మని ఉద్దేశించిన చేసిన కామెంట్లే అందుకు నిదర్శనం. ఆయన `యానిమల్` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చారు. ఇందులో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి చెబుతూ.. ప్రతి సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమలో బ్లాక్ బస్టర్స్ మూవీస్ తీసిన దర్శకులు వస్తున్నారు.. కానీ సినిమా ఫార్ములాని బ్రేక్ చేసి, ఆడియెన్స్ ని షేక్ చేసిన దర్శకులు మాత్రం కొందరే ఉంటారు. ఒకప్పుడు నా తరంలో రామ్‌గోపాల్ వర్మని నేను చూశాను. ఆయన సినిమా ఇలా తీయాలనే రూల్స్ ని బ్రేక్ చేసి అందరికి షాకిచ్చారు. ఇప్పుడు మళ్లీ సందీప్ రెడ్డి వంగాని అలా చూస్తున్నా. `యానిమల్` సినిమాని అలా మైండ్ బ్లాక్ అయ్యేలా తీశారు అని రాజమౌళి తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో క్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై తాజాగా వర్మ స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఓ ఫన్నీగా పోస్ట్ పెట్టారు. రామ్‌గోపాల్ వర్మ గురించి ఇలాంటి వ్యాఖ్యలను తాను ఎప్పుడూ వినలేదంటూ షాకింగ్ ఎమోజీని షేర్ చేసారు వర్మ. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రతి విషయాన్ని ఫన్నీ గా తీసుకునే వర్మ దీనిని కూడా వర్మ సరదాగానే తీసుకున్నారు.
https://x.com/RGVzoomin/status/1729369307547828607?s=20