IND vs AUS: ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..? మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ

  • బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు
  • మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ
  • ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..?
Rishab Panth

Rishab Panth

IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌పైనే క్రికెట్ అభిమానులందరి దృష్టి పడింది. ఈ సిరీస్‌లో విజయం సాధించాలని ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు మొదటి మ్యాచ్ పెర్త్‌లో మొదలవ్వగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్ప కూలింది. ఇకపోతే, నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంపై ఆటగాళ్లు కూడా కన్నేసినట్లు పెర్త్ మైదానంలో ఈరోజు కనిపించింది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది.

Also Read: IND vs AUS: తీరుమారని టీమిండియా.. 150కే ఆలౌట్

ఈ వైరల్ వీడియోలో.. ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్, భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మధ్య మైదానంలో చిన్న సంభాషణ జరిగింది. ఇద్దరు ఆటగాళ్లు మైదానంలో కాస్త ఫన్నీగా ఐపీఎల్ మెగావేలం సంబంధించి ఓ ఫన్నీ సంభాషణ జరిగింది. స్టంప్ మైక్‌లో వారి సంభాషణ రికార్డ్ కాగా వెంటనే వైరల్ అయ్యింది. తొలి రోజు తొలి సెషన్‌లో నాథన్‌ లియాన్‌ రిషబ్‌ పంత్‌ వద్దకు వెళ్లి ‘వేలంలో ఎక్కడికి వెళ్తున్నాం’ అని అడిగాడు. దీనిపై రిషబ్ పంత్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇందుకు ‘ నాకు తెలియదు’ అని పంత్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఈ సంభాషణ తర్వాత, ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు నవ్వుకున్నారు. ఆ తర్వాత పంత్ వెంటనే తన బ్యాటింగ్ ప్రారంభించాడు. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ ఆటగాడు తన మొదటి ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 41 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు.

Also Read: IPL 2025 Auction: ఆర్ అశ్విన్‌కు రూ.8.5 కోట్లు.. ఏ జట్టు తీసుకుందంటే?