కొత్త వాహనాలు కొనేవారికి కొత్త సంవత్సరంలో బిగ్ రిలీఫ్ లభించింది. వాహనాల రిజిస్ట్రేషన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి వాహనాల షో రూంల (డీలర్ల) వద్ద నుండే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ లో నేటి నుండి మరిన్ని సంస్కరణలు అమలుకానున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇకపై కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు.. ఎక్కడ వాహనం కొంటే అక్కడ షో రూమ్ ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
Also Read:Road Safety Shields: మీరు మీ ఫ్యామిలీ సేఫ్.. రోడ్లపై మరణాలకు చెక్ పెట్టే 5 సేఫ్టీ షీల్డ్స్!
రవాణా శాఖలో అన్ని రకాల సేవలు ఆన్లైన్ లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం సారథి లో చేరిందని దీని ద్వారా రవాణా సేవలు సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ, తీసుకొచ్చింది.. రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చింది.. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నానని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.
Also Read:NBK 111: కొత్త కథతో బాలయ్య ‘మాస్’ గర్జన.. మార్చి నుంచే సెట్స్ పైకి!
ఈ విధానం ప్రకారం అధీకృత డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. ఇన్వాయిస్, ఫారం- 21, ఫారం- 22, బీమా, చిరునామా రు జువు, వాహన ఫొటోలు అప్‌లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నేరుగా స్పీడ్‌పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపిస్తారు. ఈ సౌకర్యం బైక్‌లు, కార్లకే వర్తిస్తుందని, వాణిజ్య(ట్రాన్స్‌పోర్ట్) వాహనాలకు వర్తించదని తెలిపారు.