NTV Telugu Site icon

PM Modi-Bill Gates: డిజిటల్ రంగంతో భారత్లో చాలా మార్పులు వచ్చాయి..

Modi

Modi

మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం కొనసాగింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ నుంచి డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో పాటు వాతావ‌ర‌ణంలో మార్పులు లాంటి అనేక అంశాల‌పై వీరు ఇరువురు సుదీర్ఘంగా చ‌ర్చించారు. అయితే, ఆ చర్చలో భారతీయులపై బిల్ గేట్స్ ప్రసంశలు కురిపించాడు. టెక్నాల‌జీని భార‌తీయుల చాలా వేగంగా ఆపాదించుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. సాంకేతిక రంగంలో భార‌త్ దూసుకుపోతున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. పీఎం న‌మో యాప్‌లో ఉన్న ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీ దిగారు.

Read Also: Chandrababu: నేడు 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు

ఇక, డిజిటిల్ విప్లవంలో భారత్ వేగంగా దూసుకుపోతుంది.. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో కూడా ఇండియా స్పీడ్ అందుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇండోనేషియాలో జీ20 శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌రిగిన టైంలో భార‌త్‌లో జ‌రుగుతున్న డిజిట‌ల్ విప్లవం గురించి ప్రపంచ దేశాలు తమ ఉత్సుక‌త‌ను ప్రదర్శించాయని ఆయన చెప్పారు. అయితే, ఏక‌ఛ‌త్రాధిప‌త్యాన్ని నిర్మూలించేందుకు టెక్నాల‌జీని ప్రజాస్వామ్యంగా మార్చామని ఆ సదస్సులో చెప్పినట్లు మోడీ బిల్ గేట్స్ కు తెలిపారు. ప్రజల చేత, ప్రజల కోసం టెక్నాలజీని అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, జీ-20 స‌ద‌స్సు స‌మ‌గ్ర స్థాయిలో జ‌రిగింది.. ఇండియా ఆ స‌ద‌స్సును అద్భుతంగా నిర్వహించింద‌ని మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. భార‌త్‌లో డిజిట‌ల్ విభ‌జ‌న జ‌ర‌గ‌కుండా చూస్తాన‌ు.. డిజిట‌ల్ మౌళిక స‌దుపాయాల్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్తాన‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.

Show comments