Ram Charan : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గొప్పదా? ఎన్టీఆర్ పాత్ర గొప్పదా? ఇద్దరిలో ఎవరు బాగా చేశారు.. ఏ పాత్రకు జనాల్లో రెస్పాన్స్ వచ్చిందంటూ జరిగిన చర్చలు అందరికీ తెలిసిన విషయమే. ఇక రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయం మీద సోషల్ మీడియాలో నిత్యం చర్చలు పెట్టుకుంటూనే ఉంటారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అయితే రామ్ చరణ్ పాత్రే మెయిన్ అన్నట్లు చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ పాత్రలోనే చాలా లేయర్లు ఉంటాయని, నటించడానికి చాలా స్కోప్, కష్టతరమైన పాత్ర అని చెప్పారు. దాంతో విజయేంద్ర ప్రసాద్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు.
అలా ఆర్ఆర్ఆర్ గురించి ఎప్పుడు చర్చలు జరిగినా కూడా ఇరు హీరోల అభిమానుల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. తాజాగా మళ్లీ ఈ హీరోల అభిమానులు ట్విట్టర్లో మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా ఓ ఫ్రెంచ్ నటుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హీరో రామ్ చరణ్ అన్నట్లు మాట్లాడాడు. అతని పేరు మరిచిపోయాను.. సరిగా నాకు గుర్తు లేదు.. ఆర్మీలో ఉంటాడు అన్నట్లుగా సదరు నటుడు ఇంట్రో సీన్ గురించి చెప్పుకొచ్చారు. ఇంతలో యాంకర్ అతడికి హింట్ ఇచ్చేసింది.
Read Also:Pawan Kalyan : భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..?
మెయిన్ హీరో అంటూ రామ్ చరణ్ గురించి సదరు ఫ్రెంచ్ నటుడు లుకాస్ బ్రావో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో ఆయన నటన అద్భుతంగా ఉందని, ఎంతో ఎమోషనల్‌గా యాక్ట్ చేశారని, బ్రీత్ టేకింగ్‌లా అనిపించిందంటూ రామ్ చరణ్ పర్ఫామెన్స్ గురించి సదరు నటుడు మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫ్రెంచ్ నటుడు మాట్లాడిన ఈ మాటలను రామ్ చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు. దీంతో మళ్లీ ఆర్ఆర్ఆర్ మీద చర్చలు మొదలయ్యాయి. ఇలా రెండు పెద్ద కుటుంబాల నుంచి, స్టార్ డమ్ ఉన్న హీరోలని పెట్టి మల్టీ స్టారర్ తీసిన రాజమౌళి ఆస్కార్ వరకు సినిమాను తీసుకెళ్లారు. కానీ ఈ అభిమానుల యుద్ధాలను మాత్రం ఆపలేకపోతోన్నాడు. ఈ చర్చలు ఎప్పటికీ ఓ పట్టాన ఆగేవి కావని అందరికీ విధితమే.
Read Also:Nandamuri Balakrishna: అన్న క్యాంటీన్ పేదల కడుపు నింపుతుంది.. నాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు..!