తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ ‘మహాలక్ష్మి’ ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖా, సీతక్క, సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పలువురు ఎమ్మెల్యేలు, , రవాణా శాఖ సెక్రటరీ వాణిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బస్సులో ప్రయాణం చేశారు.
Read Also: Adudam Andhra: క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్.. 9 సంస్థలతో ఏపీ సర్కార్ ఒప్పందాలు
ఈ నేపథ్యంలో.. సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం రేవంత్.. జర్నలిస్టులు, ఇతర ప్రముఖులకు ఉచిత బస్సు ప్రయాణ టికెట్ అందించారు. అయితే, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉచితంగా ప్రయాణించగా రేవంత్ మాత్రం డబ్బులు చెల్లించి టికెట్ తీసుకున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవడంతో.. మహిళలు బస్సులు ఎక్కి ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ స్కీమ్ పై పలువురు మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also: YS Bharathi Look: యాత్ర 2 వైఎస్ భారతి లుక్ రిలీజ్.. భలే సూట్ అయిందే!
కాగా.. తెలంగాణకు చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ క్రమంలో.. 7292 బస్సుల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ను జారీ చేస్తారు. లోకల్ పోలరైజేషన్ కోసం ప్రయాణ సమయంలో కండక్టర్లకు గుర్తింపు కార్డులు చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వం TSRTCకి ఖర్చును రీయింబర్స్ చేస్తుంది.