Job Cheating: ఉద్యోగ ప్రయత్నం చేసి.. అలసిపోయిన అమాయకులే వాళ్ల టార్గెట్..
- అమాయకులైన నిరుద్యోగులకు వల
- కలెక్టరేట్‌లో ఉద్యోగాలిప్పిస్తానని బురిడీ
- ఒక్కొక్కరి వద్ద రూ. 4 లక్షల వరకు వసూలు
- జాయింట్ కలెక్టర్ సంతకం ఫోర్జరీ
- నకిలీ అపాయింట్‌మెంట్స్ ఇచ్చిన నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగం ఇప్పిస్తామంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. అది కూడా గవర్నమెంట్ ఆఫీసులో కొలవు అంటే ఎగిరి గంతేస్తారు. సరిగ్గా దీన్నే కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నిజానికి అలాంటి వాడికే ఉద్యోగానికి టికానా ఉండదు. కానీ ఉద్యోగాలిప్పిస్తామని బురిడీ కొట్టి అమాయకుల దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. అలాంటి ఉదంతమే గుంటూరు జిల్లాలో బయటపడింది. ఉద్యోగ ప్రయత్నం చేసి.. చేసి అలసిపోయిన అమాయకులే వాళ్ల టార్గెట్..
Also Read:Hyd Sarogacy: అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే.. కొడుకు, కూతురుతో అక్రమ దందా చేయిస్తూ..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
గవర్నమెంట్ ఉద్యోగం, ఔట్ సోర్సింగ్ జాబ్ అంటూ ఎర.. పాపం.. ఆ అమాయకులు వారిని గుడ్డిగా నమ్మేసి.. వారు అడిగినంతా సమర్పించుకుంటారు. ఇక అప్పటి నుంచి అసలు కథ షురూ అవుతుంది. నిజానికి డబ్బు చేతికి వచ్చే వరకు.. ఒక్క రింగ్‌కే ఫోన్ లిఫ్ట్ చేసే కేటుగాళ్లు.. డబ్బులు అందిన తర్వాత మాత్రం.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఫోన్‌కు ఆన్సర్ చేసినా.. ఇదిగో అదిగో అంటూ తిప్పంచుకుంటారు..
Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
గుంటూరు జిల్లాలోనూ సరిగ్గా ఇలాంటి కేటుగాడే తయారయ్యాడు. అమాయకులైన నిరుద్యోగులను వలలో వేసుకున్నాడు నాగార్జున అనే బ్రోకర్. కలెక్టరేట్‌లో ఉద్యోగాలిప్పిస్తానని బురిడీ కొట్టించాడు. ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ. 4 లక్షల వరకు వసూలు చేశాడు. చాలా రోజులు తన చుట్టూ తిప్పించుకుని.. బాధితులు గట్టిగా అడిగే సరికి మరో మోసానికి తెరతీశాడు. ఏకంగా జాయింట్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్‌మెంట్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.
Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
ఈ క్రమంలో నర్సీపట్నంకు చెందిన చింరజీవి, పూర్ణ.. నాగార్జున చేతిలో మోసపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. బాధిత యువకులు గ్రీవెన్స్‌లోఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెప్పడంతో మళ్లీ పోలీసులను ఆశ్రయించే పనిలో పడ్డారు. గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో ఎవరు డబ్బులు అడిగినా నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. అలా డబ్బులు అడుగుతున్నారంటే కచ్చితంగా మోసగాళ్లే అయి ఉంటారంటున్నారు. కాబట్టి వారి వలలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నారు.
- Tags
- fraud
- Guntur District
- Jobs
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!