Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్
- దేశంలోకి రాకుండా నిషేధం
- బెన్-గ్విర్ ప్రవర్తనపై ప్రపంచ దేశాలు ఆక్షేపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్‌కు చెందిన అతివాద నేత, జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్‌పై ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ భూభాగంలోకి ప్రవేశం నిషేధిస్తున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో శనివారం ప్రకటించారు. గాజాకు మానవతా సహాయం తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తల బృందంపై జరిగిన వ్యవహారంపై ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆగ్రహం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
“ఇప్పటి నుంచి ఇటమార్ బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్‌లోకి ప్రవేశం నిషేధం” అంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎక్స్‌లో ప్రకటించారు. అలాగే ఇటలీ విదేశాంగ మంత్రితో కలిసి యూరోపియన్ యూనియన్ కూడా బెన్-గ్విర్‌పై ఆంక్షలు విధించాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
Also Read
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Allu Arjun - Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల గాజాకు మానవతా సహాయం అందించేందుకు బయల్దేరిన కార్యకర్తల ఫ్లోటిల్లాపై ఇజ్రాయెల్ చర్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ సందర్భంగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని నేలకూల్చిన దృశ్యాలను ఎద్దేవా చేస్తూ బెన్-గ్విర్ విడుదల చేసిన వీడియోపై పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అదుపులో ఉన్న సమయంలో తమపై శారీరక దాడులు జరిగాయని కొందరు కార్యకర్తలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ జైలు శాఖ ఖండించింది.
ఇక బెన్-గ్విర్ వ్యవహారంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. “బెన్-గ్విర్ ప్రవర్తన ఇజ్రాయెల్ విలువలు, ప్రమాణాలకు అనుగుణంగా లేదు” అని వ్యాఖ్యానించారు. అమెరికా కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఫ్రాన్స్ నిర్ణయంపై బెన్-గ్విర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
తాజావార్తలు
-
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
-
Car Mileage Tips : ఫోన్ ఛార్జింగ్‌తో మైలేజ్ పడిపోతుందా? కార్లలో దాగిన అసలు సీక్రెట్ ఇదే.!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
-
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!