ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. థియేటర్లలో విడుదలై సూపర్ సక్సెస్ అయిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఓం భీం బుష్..
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. ఇంతకాలానికి తెలుగు ప్రేక్షకులకు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల జనాలను కడుపుబ్బా నవ్వించేసారు.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
గామి..
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గామి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విధ్యాదర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. దాదాపుగా ఆరేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది..ఇప్పుడు ఓటీటీలోకి విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది.. ఏప్రిల్ 12న జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుంది..
లాల్ సలామ్..
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ చేసిన సినిమా లాల్ సలామ్.. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్‌లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది.. ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది.. ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘లాల్ సలామ్’ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది..
ప్రేమలు..
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా ప్రేమలు.. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కాబోతుంది.. ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‌లో మలయాళం, హిందీ, తమిళ వెర్షన్‍లు అందుబాటులోకి రాబోతుంది..