Children Missing : తిరుపతి మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన నలుగురు చిన్నారులు మంగళం జడ్పీ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.. వీరంతా పాఠశాలకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లారో తెలియక తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఎంత వెతికినా చిన్నారుల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అలిపిరి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యార్థులను వెతికేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also: Vizag Student Died: రైలు దిగుతూ జారిపడి… చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి
అదృశ్యమైన చిన్నారులను వెతికేందుకు సీసీ కెమెరాలను పరిశీలించారు. అదృశ్యమైన పిల్లలు వివరాలు.. నలుగురు విద్యార్థులు గతమ్మోహోత్ పాఠశాలలో బయలుదేరి వారు స్కూలుకు వెళ్లకుండా కపిల తీర్థం వెళ్లారు. అక్కడి నుంచి వారు లీలామహల్ సర్కిల్ కు వచ్చారు. ఆ తర్వాత నలుగురు విద్యార్థులు ఆచూకీ కనబడలేదు. వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలిపిరి ఎస్సై ఇమ్రాన్ గురువారం తెలిపారు. ఈ విద్యార్థులు అదృశ్యం కేసు నమోదు చేసి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సీసీ కెమెరాలు పరిశీలించి జరుగుతున్నదని వివరించారు. ఎక్కడైనా ఎవరికైనా విద్యార్థులు సమాచారం తెలిస్తే అలిపిరి పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియజేయాలని కోరారు. అయితే ట్రైన్ లో వెళితే ఎలా ఉంటుందో చూడాలని అ సమయంలో కనిపించిన ఓ వార్డు వాలంటీర్ కు విద్యార్థులు చెప్పినట్లు సమాచారం.