NTV Telugu Site icon

Road Accident: కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ టూరిస్ట్ వ్యాన్, నలుగురు మృతి

Car Accident

Car Accident

కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్గామ్‌ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న టూరిస్ట్ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పంజాబ్ వాసులు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: Mayawati: ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికారంలో ఉండరు.. బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు

నిపోరా ప్రాంతంలోని గ్రిడ్ స్టేషన్ సమీపంలో ఖాజీగుండ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో వాహనంలో ఏడుగురు పర్యాటకులు ఉన్నారని.. వారంతా పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. మరోవైపు.. గాయపడిన వారిని అనంత్‌నాగ్‌లోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో నలుగురు చనిపోయారని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Read Also: Armenian pm: ఆర్మేనియన్ ప్రధాని హెలికాప్టర్ ఎమర్జెన్సీ  ల్యాండింగ్

మృతులను సందీప్ శర్మ (28), రోమి (26), జగదీష్ అలియాస్ హనీ (23), గుర్మీత్ సింగ్ (23)గా గుర్తించారు. గాయపడిన వారిలో హర్‌చంద్ సింగ్ (34), కరణ్‌పాల్ (25), అషు (18)లు ఉన్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.