Road Accident: కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ టూరిస్ట్ వ్యాన్, నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్గామ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న టూరిస్ట్ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పంజాబ్ వాసులు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Mayawati: ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికారంలో ఉండరు.. బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
నిపోరా ప్రాంతంలోని గ్రిడ్ స్టేషన్ సమీపంలో ఖాజీగుండ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో వాహనంలో ఏడుగురు పర్యాటకులు ఉన్నారని.. వారంతా పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. మరోవైపు.. గాయపడిన వారిని అనంత్‌నాగ్‌లోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో నలుగురు చనిపోయారని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Also: Armenian pm: ఆర్మేనియన్ ప్రధాని హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
మృతులను సందీప్ శర్మ (28), రోమి (26), జగదీష్ అలియాస్ హనీ (23), గుర్మీత్ సింగ్ (23)గా గుర్తించారు. గాయపడిన వారిలో హర్‌చంద్ సింగ్ (34), కరణ్‌పాల్ (25), అషు (18)లు ఉన్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..