కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్గామ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న టూరిస్ట్ వాహనం ఒక్కసారిగా లోయలో జారి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పంజాబ్ వాసులు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.