Site icon NTV Telugu

Tragic Incident: ఏం కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Gujarat

Gujarat

గుజరాత్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ద్వారకా జిల్లాలోని భన్వాడ్‌లోని ధారగఢ్ ప్రాంతంలో నలుగురి మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. వీరంతా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద పాయిజన్ బాటిల్, ప్లాస్టిక్ గ్లాసులు, కోలా డ్రింక్ బాటిల్‌తో పాటు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. మూడు మొబైల్ ఫోన్లు, పాన్ కార్డు, గుర్తింపు కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు.

Read Also: Muchumarri Missing Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక పరిణామం..

కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా.. ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. మృతి చెందిన నలుగురు వ్యక్తులు 42 ఏళ్ల అశోక్ ధుమ్వా, 42 ఏళ్ల లీలుబెన్ అశోక్ ధుమ్వా, 20 ఏళ్ల జిగ్నేష్ అశోక్ ధుమ్వా, 18 ఏళ్ల కింజల్ దుమ్వాగా గుర్తించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: Nepal: విశ్వాస పరీక్షలో ఓడిపోయిన నేపాల్ ప్రధాని ప్రచండ.. కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి..?

రూ. 20 లక్షలు ఇవ్వాలని విశాల్ జడేజా అనే వ్యక్తి బెదిరింపులు, దాడులు, ఒత్తిడి చేశారని మృతుడి కుటుంబ పెద్ద అశోక్‌భాయ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన కుటుంబంలోని నలుగురు సభ్యులు రెండు స్కూటర్లపై జామ్‌నగర్‌కు వెళ్లి భన్వాడ్‌లోని ధారగఢ్ గ్రామంలో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా విశాల్ జడేజాపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version