NTV Telugu Site icon

Accident: ఏపీలో పండగపూట తీవ్ర విషాదం.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

Accident

Accident

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా మండపల్లి మండలం కానుకొల్లులో తీవ్ర విషాదం జరిగింది. ఇవాళ ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న యువతులపై నుంచి సడన్‌గా ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని అనే యువతి అక్కడికక్కడే మరణించగా.. మరో యువతి పల్లవి దుర్గకు తీవ్ర గాయాలైయ్యాయి. ఇక, స్థానికులు వెంటనే గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. దీంతో లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు.. మరొకరిని పట్టుకొని గ్రామస్తులు కొట్టారు చితకబాదిన తర్వాత పోలీసులకు పట్టించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: CM KCR: ఫామ్ హౌస్‌కి అవన్నీ పంపండి.. ఓ షాప్ యజమానికి కేసీఆర్ కాల్..

మరో వైపు, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పిల్లా పేరు వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని పామూరు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందినవారుగా గుర్తించారు. ఇక, కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పామర్రు కురుమద్దాలి గ్రామంలో పెట్రోల్ బంక్ నుంచి బైక్ కు పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు హరీష్, గోవింద్ మరణించారు. ఇక, యువకుల మరణ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయిన కుటుంబాలు.. కురుమద్దాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. పండుగ రోజున ప్రమాదాలు జరగడంతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం నెలకొంది.