Site icon NTV Telugu

double bedroom scam: డబుల్ బెడ్రూం స్కాంలో నలుగురి అరెస్ట్

Double Bed Room

Double Bed Room

double bedroom scam: మహబూబ్ నగర్ లో వెలుగు చూసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కుంభకోణంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత కార్యదర్శి కొడుకు కాగా మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ ఉన్నాడు. వీరంతా డబుల్ బెడ్రూం ఇళ్లకు నకిలీ పట్టాలు సృష్టించి వసూళ్లకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. కేసు పూర్తి వివరాలను మహబూబ్​నగర్​రూరల్​ సీఐ రాజేశ్వర్​గౌడ్ మీడియాకు​ తెలియజేశారు. భగీరథ కాలనీకి చెందిన అరుణకుమార్​రెడ్డికి న్యూ గంజ్​కు చెందిన సిరాజుద్దీన్​ ఖాద్రీ దివిటిపల్లి వద్ద డబుల్​బెడ్​రూమ్​ఇప్పిస్తానని రూ.3.5 లక్షలు తీసుకున్నాడు. ఎంతకూ ఇల్లు ఇప్పించకపోవడంతో గురువారం ఫిర్యాదు చేశాడు. సిరాజుద్దీన్​ ఖాద్రీ…అరుణ్​కుమార్​రెడ్డి నుంచే కాకుండా ఖాదర్​అనే వ్యక్తితో కలిసి మరో ఇద్దరి నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. ప్రస్తుతం ఖాదర్​ పరారీలో ఉన్నాడు. సిరాజుద్దీన్​ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గరి నుంచి రూ.2.50 లక్షలు, సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు.

Read also: viral news: ఎంత చదవాలి.. ముసలాడిని అయ్యేలా ఉన్న.. నవ్వు తెప్పిస్తున్న బుడ్డోడి మాటలు

రెండో కేసులో జిల్లా కేంద్రంలోని పుట్నాలబట్టి ఏరియాకు చెందిన మరో బాధితుడు సుధాకర్​ఇచ్చిన కంప్లయింట్​మేరకు పట్టణంలోని ఆల్మాస్​ఖాన్​ వీధికి చెందిన వానగంటి ప్రకాశ్​, బోయపల్లి గేట్​ప్రాంతానికి చెందిన మహ్మద్​ఇర్ఫాన్​లపై కేసు నమోదు చేశారు. వీరు ఒకరికి డబుల్​ బెడ్​రూమ్​ఇప్పిస్తామని రూ.2 లక్షలు, మరో ముగ్గురు నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. హనుమాన్​పురకు చెందిన మరో బాధితుడు సయ్యద్​ కలాం పాషా ఇచ్చిన కంప్లయింట్​మేరకు ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న దేవేందర్​ కొడుకు అక్షయ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన బాధితుడి నుంచి రూ.30 వేలు, మరో వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసినట్లు తెలిపారు. వీరిని అరెస్టు రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Read also:Radha Tmt: మార్కెట్లోకి రాధా టీఎంటీ సరికొత్త మోడల్

డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కొందరు డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ కుంభకోణంలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.

Exit mobile version