NTV Telugu Site icon

Koo App Shutdown : మూతపడ్డ దేశీయ సోషల్‌ మీడియా ‘ కూ ‘ యాప్‌..

Koo App

Koo App

Koo App Shutdown : ఎక్స్‌ (ట్విటర్‌) కు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించిన దేశీయ అప్లికేషన్ ‘ కూ ‘ (Koo) యాప్ మూసివేయబడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తాజాగా తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ బుధవారం లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. సేల్‌ పై డైలీ హంట్‌తో సహా వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Hathras stampede: “భోలే బాబా” సెక్యూరిటీ నెట్టేయడంతోనే తొక్కిసలాట.. కీలక విషయాలు వెలుగులోకి..

కూ యాప్ 2019లో ప్రారంభించబడింది. అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవత్కా కలిసి దీన్ని ప్రారంభించారు. రాధాకృష్ణ సీఈవో బాధ్యతలు నిర్వహించారు. రైతు ఉద్యమం సమయంలో ఖాతాల సస్పెన్షన్‌ పై కేంద్రం ట్విట్టర్‌ ( X ) తో విభేదించినప్పుడు కూ యాప్ బాగా ప్రజాదరణ పొందింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులే స్వయంగా దీనిని ఆత్మనిర్భర్ అప్లికేషన్‌గా ప్రచారం చేశారు. దీని కారణంగా, కాలక్రమేణా వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తరువాత కంపెనీ తన కార్యకలాపాలను నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా విస్తరించింది. ఆ తర్వాత సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయింది. ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపులను కూడా చేసింది.

Bhole baba: హత్రాస్ భోలే బాబాపై లైంగిక వేధింపుల కేసులు.. బ్యాగ్రౌండ్ ఇదే!

విక్రయం కోసం పలు అంతర్జాతీయ కంపెనీలు, మీడియా సంస్థలతో చర్చలు జరిపినప్పటికీ ఏ ఒక్కటీ ఫలితం ఇవ్వలేదని అప్రమేయ, మయాంక్ లు తెలిపారు. అందువల్ల కార్యాచరణకు స్వస్తి చెప్పాలనుకున్నారు. ఈ మేరకు లింక్డ్‌ఇన్‌ లో ఒక ప్రకటన చేసారు. స్థానిక భాషలపై దృష్టి సారించి హోమ్ యాప్‌ను అభివృద్ధి చేశామని, ఒక దశలో “కూ” 21 లక్షల మంది రోజువారీ క్రియాశీల వినియోగదారులను (DAU) సంపాదించిందని ఆయన చెప్పారు. నిధుల కొరత తమకు అడ్డంకిగా మారిందని, దేశీయ యాప్‌ను కొనసాగించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని వారు రాశారు. నాలుగు సంవత్సరాల ప్రయాణంలో “కూ” ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్‌లో వ్యవస్థాపకులు లిటిల్ ఎల్లో బర్డ్ వీడ్కోలు చెబుతున్నట్లు తెలిపారు.