NTV Telugu Site icon

Formula E-Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు

Ktr Highcourt

Ktr Highcourt

Formula E-Race Case : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన వెంటనే, ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరంగా కొనసాగించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రీన్‌కో సంస్థ , దాని అనుబంధ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. తోడుగా, నిందితుల ఇళ్లపై సోదాలు చేపట్టేందుకు కోర్టు నుండి సెర్చ్ వారెంట్‌ను కూడా పొందింది. అయితే.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆర్డర్ కాపీ సిద్ధమైంది. ఈ ఆర్డర్ కాపీలో జడ్జి లక్ష్మణ్ సంచలన అంశాలు ప్రస్తావించారు. HMDA పరిధికి మించి డబ్బు బదిలీ జరిగిందని హైకోర్టు వెల్లడించింది.. అయితే.. కేబినెట్‌ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని హైకోర్టు సూచించింది.

CM Chandrababu: కుప్పం అభివృద్ధికి ‘జననాయకుడు’ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాం..

కేటీఆర్‌ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారని, చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు తగిన సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై ఏసీబీ ఆధారాలు సేకరించాలని, ఫార్ములా ఈ-రేస్‌ కేసులో మేం ఇప్పడే జోక్యం చేసుకోమని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ-రేస్‌ వ్యవహారంలో ఏం జరిగిందో దర్యాప్తులో తేలుతుందని, ఈ తీర్పు కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌కు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది.

Boy Missing : కలకలం రేపుతున్న గురుకుల పాఠశాలలో విద్యార్థి అదృశ్యం

Show comments