Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు గడ్డుకాలం నడుస్తోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు ఆదిలోనే హంస పాదు ఎదురైంది. తాజాగా నూయార్క్ ఫెడరల్ కోర్టు ఓ కేసు విషయంలో ఆయనను దోషిగా తేల్చింది.. 1990లో మ్యాగజైన్ రచయిత ఇ.జీన్ కారోల్ పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ట్రంప్‌ను దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా అనేక సందర్బాల్లో జీన్ కారోల్ ను అబద్దాలకోరు అని పిలిచి ఆమెను అప్రతిష్టపాలు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించారు. దీంతో కరోల్‌కు ఐదు మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ తెలిపింది. ఇదిలాఉంటే.. జీన్ కారోల్‌పై అత్యాచారం కేసులో మాత్రం ట్రంప్ నిర్దోషి అని జ్యూరీ నిర్ధారించింది. కారోల్ ట్రంప్ పై చేసిన అత్యాచారం అభియోగాన్ని జ్యూరీ తిరస్కరించింది.
Read Also:Underwater Kiss : ఇదేం పోయేకాలం రా.. ఎక్కడా జాగా లేనట్లు నీటి అడుగున ముద్దులేంటి
కారోల్ పై లైంగిక వేధింపుల కేసు విచారణ ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమైంది. తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ పలు దఫాల విచారణ అనంతరం తనపై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించింది.జ్యూరీ తీర్పుపై ట్రంప్ స్పందించారు. ఈ తీర్పు అవమానకరమైనదిగా భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మహిళ ఎవరో నాకు ఖచ్చితంగా తెలియదు అంటూ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‍లో ట్రంప్ పోస్టు చేశారు. 1996లో మాన్‌హాటన్‌లోని ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెసింగ్ రూంలో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని ఇ. జీన్ కారోల్ ఆరోపించింది. ఈమెకు ప్రస్తుతం 79ఏళ్లు. ఈ విషయాన్ని ఆమె 2019లో ఒక పుస్తకంలో మొదట ప్రస్తావించింది. ఇటీవల కాలంలో డజనుకుపైగా మహిళలు ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం విధితమే. వీరిలో ఫోర్న్ స్టార్ స్టార్మీ డేవియల్స్ కూడా ఉన్నారు. స్టార్ స్టార్మీ కేసు విషయంలోనూ గతంలో ట్రంప్‌కు చుక్కెదురైంది. తాజాగా జీన్ కారోల్ ట్రంప్ పై చేసిన అభియోగాలను తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ నిజమేనని నిర్ధారించింది. ఈ లైంగిక వేధింపుల కేసులు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయాలనే ప్లాన్‌కు విఘాతం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also:CM YS Jagan To Visit Vizag: రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..