Raging In Collage: ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి నిరసన చేయడంతో.. జూనియర్‌ను చితకొట్టిన సీనియర్లు
- నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో.
- జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ దాడి.
- జూనియర్‌ను చితకొట్టిన సీనియర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raging In Collage: నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ దాడి ఘటన వెలుగు చూసింది. అందిన సమాచారం ప్రకారం.. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా జూనియర్ విద్యార్థులు నిరసన తెలపడంతో సీనియర్లు వారిని కొట్టారు. బాధిత విద్యార్థి సెక్టార్ -39 పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో భాగంగా గత నెలలో రాత్రి 3 గంటల సమయంలో కొంతమంది సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసి కొట్టారని ఆరోపించారు. ఫిర్యాదు ప్రకారం విద్యార్థి ఆదర్శ్ త్రిపాఠి, అతని సహవిద్యార్థులు వారి గదుల్లో ఉండగా.. కొంతమంది సీనియర్లు అకస్మాత్తుగా గదిలోకి వచ్చారు. ఆ తర్వాత సీనియర్లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం ప్రారంభించారు. బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. దీనిపై తాను నిరసన తెలపడంతో సీనియర్లు తనను దుర్భాషలాడి దారుణంగా కొట్టారని అన్నాడు. ఈ క్రమంలో బాధిత విద్యార్థికి ఒక పన్ను విరిగి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: IND vs SA: ఆధిక్యం ఎవరు సాధిస్తారో? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సీనియర్లు జూనియర్ విద్యార్థులను దుర్భాషలాడుతూ కొట్టారు. తనకు చాలా భయంగా ఉందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, యూనివర్శిటీ క్యాంపస్‌లో వైరల్‌గా మారిన వీడియో నెలరోజుల నాటిదని నోయిడా పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న సీనియర్ విద్యార్థులపై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ కేసును మళ్లీ విచారిస్తున్నామని, బాధిత విద్యార్థిని వాంగ్మూలం ఆధారంగా తదుపరి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యంత్రాంగం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ వీడియోపై సమాచారం అందుకున్న యూనివర్సిటీ వెంటనే చర్యలు చేపట్టింది.
नोएडा की महर्षि यूनिवर्सिटी के कॉलेज हॉस्टल में सीनियर छात्रों की गुंडागर्दी का वीडियो वायरल।
सीनियर छात्रों ने रैगिंग का विरोध करने पर जूनियर छात्रों के साथ हॉस्टल रूम में जमकर की मारपीट, एक छात्र का दांत भी तोडा।
यह मारपीट की घटना 14 अक्टूबर की बताई जा रही है। pic.twitter.com/TZKiHN8w22
— Greater Noida West (@GreaterNoidaW) November 12, 2024
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!