NTV Telugu Site icon

Dale Steyn: మహ్మద్ సిరాజ్‌పై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..!

Dale Styen

Dale Styen

ప్రపంచ కప్కు ముందు ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పై దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ కప్ 2023లో సిరాజ్ ఆటతీరు చూడదగినదని స్టెయిన్ చెప్పాడు. ప్రపంచకప్లో అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్లపైనే ఉంటుందని స్టెయిన్ అన్నాడు. అందులో మహ్మద్ సిరాజ్.. టీమిండియాకు కీలకమని నిరూపించుకుంటాడని తెలిపాడు. సిరాజ్ బంతితో స్వింగ్‌ చేయగలడని.. బుమ్రాతో పాటు సిరాజ్ కూడా ముఖ్యమైన బౌలర్ అని చెప్పుకొచ్చాడు.

RC 16: రామ్ చరణ్ 16లో స్టార్ హీరోయిన్ కూతురు?

ఇప్పటి వరకు సిరాజ్ పెర్‌ఫార్మెన్స్‌ను పరిశీలిస్తే.. ప్రతి ఫార్మాట్‌లోనూ తనదైన శైలిలో ప్రదర్శించాడు. సిరాజ్ 30 వన్డేల్లో 54 వికెట్లు తీశాడు. 8 టీ20 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. దీంతో పాటు 21 టెస్టు మ్యాచ్‌ల్లో 59 వికెట్లు తీశాడు. ఇటీవల ఆసియా కప్ 2023లో కూడా సిరాజ్ బౌలింగ్ తో శ్రీలంకను కోలుకోలేని దెబ్బ తీశాడు. శ్రీలంకపై 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

Balakrishna: దెబ్బకు దెబ్బ తీస్తాం.. మేము ఎవరికి భయపడం..!

ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచ కప్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 14 న జరుగనుంది. ఈ ఓల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నవంబర్ 5న భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగనుంది.