NTV Telugu Site icon

Former Pope Benedict Condition Critical : మాజీ పోప్ బెనెడిక్ట్ పరిస్థితి విషమం

Pope

Pope

Former Pope Benedict Condition Critical : మాజీ పోప్ బెనెడిక్ట్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వయసు సంబంధ ఆరోగ్య సమస్యలతో బెనెడిక్ట్‌ ఆస్పత్రిలో చేరారు. బెనెడిక్ట్‌ తొమ్మిదేళ్ల క్రితం చర్చి అత్యున్నత పదవికి రాజీనామా చేశారు. బెనెడిక్ట్ పరిస్థితి విషమంగా ఉందని, వృద్ధాప్య సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడని వాటికన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘పోప్ బెనెడిక్ట్ కోసం ప్రార్థించాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అతని పరిస్థితి విషమంగా ఉన్నది’ అని ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు వేల సంవత్సరాల వాటికన్ చర్చి చరిత్రలో బెనెడిక్ట్‌ పదవీకాలం అనేక వివాదాలతో చుట్టుముట్టింది.

Read Also : Eknath Shinde : అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం.. కానీ ఒక్క అంగుళం కూడా వదులుకోం

క్రైస్తవ మతంలో అతిపెద్ద విభాగమైన క్యాథలిక్కులకు సారథ్యం వహిస్తోన్న పోప్‌ 2013 ఫిబ్రవరి 11న రాజీనామా చేస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2005లో పోప్‌గా బాధ్యతలు చేపట్టిన బెనడిక్ట్‌ అనారోగ్య కారణాలతో తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. దైవ నిర్ణయం మేరకే తన పదవికి రాజీనామా చేస్తున్నానని, తన వారసుడ్ని భగవంతుడే ఎంపిక చేస్తారని ఆనాడు ప్రకటించారు. 16వ పోప్‌ బెనడిక్ట్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 600 సంవత్సరాల వాటికన్‌ చరిత్రలో రాజీనామా చేస్తున్న పోప్‌గా బెనడిక్ట్‌ రికార్డు సృష్టించారు. 2005లో పోప్‌ జాన్‌పాల్‌ – 2 మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన బెనడిక్ట్‌ సాంప్రదాయక క్యాథలిక్‌ అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు శరీరం సహకరించనందున రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.