Ayodhya Ram Mandir: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. ఆలయాన్ని సందర్శించిన పాక్ క్రికెటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danish Kaneria celebrate Ram Mandir PranPratishtha ceremony: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సాగిన ఈ మహా క్రతువుకు దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యావత్ భారతావని ‘జై శ్రీరాం’ నినాదాలతో ప్రతిధ్వనించింది. విదేశాల్లోనూ భారతీయులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ప్లేయర్స్ కూడా రామమందిర నిర్మాణం గురించి స్పందించారు.
బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా హర్షం వ్యక్తం చేశాడు. సోమవారం రామయ్య ప్రాణప్రాతిష్ఠ వేడుకలు జరుగుతుండగా.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆలయాన్ని కనేరియా సందర్శించాడు. అక్కడి హిందువులతో కలిసి అతడు సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కనేరియా తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. శ్రీరాముడి విగ్రహం ఫొటోతో ఓ పోస్ట్ పెట్టాడు. ‘శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కోట్లమంది ప్రార్థనలు నెరవేరాయి. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది’ అని ఎక్స్‌లో కనేరియా పేర్కొన్నాడు.
Also Read
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
Also Read: SA20 League 2024: 52 పరుగులకే క్యాపిటల్స్ ఆలౌట్.. సన్‌రైజర్స్ సంచలన విజయం!
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రామ భక్తిని చాటుకున్నాడు. సోమవారం రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ‘జై శ్రీరామ్’ అంటూ భారతీయులందరికీ శుభాకాంక్షలను తెలిపాడు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో శ్రీరాముడి రాక ఫొటోను షేర్ చేసిన వార్నర్.. ‘జై శ్రీరాం ఇండియా’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక దక్షిణాఫ్రికాకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహరాజ్ కూడా బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై సంతోషం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
सदियों को प्रतीक्षा पूर्ण हुई, प्रतिज्ञा पूर्ण हुई, प्राण-प्रतिष्ठा पूर्ण हुई। pic.twitter.com/4hhNm2MDoS
— Danish Kaneria (@DanishKaneria61) January 22, 2024
తాజావార్తలు
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..