Kethireddy Venkatarami Reddy: పైలట్ అవతారం ఎత్తిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..
- పైలట్ అవతారం ఎత్తిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..
- హైదరాబాద్ లో ఛాపర్ నడిపిన మాజీ ఎమ్మెల్యే..
- అంతులేని సాహసాలు ఉన్నాయి.. ఇది ఆరంభం మాత్రమేనంటూ ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy Venkatarami Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. కొత్త అవతారం ఎత్తారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తూ.. ఆ సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతూ వచ్చారు.. అయితే, గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. వైసీపీ ఓటమిపై సంచలన విశ్లేషణలు చేశారు.. అయితే, ఇప్పుడు పైలట్ అవతారం ఎత్తారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఛాపర్ నడిపి ఔరా..! అనిపించి మరోసారి వార్తల్లో నిలిచారు.. ఛాపర్ లో హైదరాబాద్ పరిసరాల్లో చక్కర్లు కొట్టారు.. సోషల్ మీడియాలో కేతిరెడ్డి షేర్ చేసిన వీడియోలు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలను కూడా గమనించవచ్చు..
Read Also: TG Govt: ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే… ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదు..
Also Read
ఇక, తాను ఛాపర్ నడిపిన వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. “కలల నుండి వాస్తవికత వరకు – అధికారికంగా పైలట్! అయ్యాను.. ఆకాశం ఇకపై పరిమితి కాదు.. ఇది ప్రారంభం మాత్రమే.. ప్రతి సవాలుకు, ప్రతి పాఠంకు మరియు ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ముందుకు అంతులేని సాహసాలు ఉన్నాయి!.. నేను ఒక్కడిని ఛాపర్ ఆకాశంలో ఎగిరిన తొలి ప్రయాణం ఇదే.. అంటూ ట్వీట్ చేశారు వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..
"From dreams to reality—officially a PILOT! ✈️ The sky is no longer the limit; it’s just the beginning. Grateful for every challenge, every lesson, and everyone who supported me on this journey. Here’s to endless adventures ahead!
My first solo flying.
Thanks @wings team . pic.twitter.com/q8UBuIaGVR— Kethireddy Venkatarami Reddy (@KethireddyMla) March 30, 2025
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!