NTV Telugu Site icon

Kakarla Suresh: మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుకు కాకర్ల ఘన సన్మానం..

Kakarla

Kakarla

ఉదయగిరి అభివృద్ధి ప్రధాత మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావును నెల్లూరులోని అతిధి గ్రౌండ్ హోటల్లో సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మీ రాజకీయ అనుభవాన్ని జోడించి తనను గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో నిర్వహించగా, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుకు జాతీయస్థాయిలో పదవి రావడం పట్ల నాయకుల్లో ఆనందం వెల్లువెరిసింది. నాయకులందరూ బొల్లినేని వెంకట రామారావుకు శుభాకాంక్షలు తెలియజేసి బొకేలు అందజేశారు. గజమాలతో ఘనంగా సత్కరించారు.

Kodali Nani: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గౌరవస్థానం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త నాయకులు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేయాలని పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ ను గెలిపించుకొని చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ఎన్నికల వ్యూహాన్ని నాయకులు రచించాలన్నారు. వైసీపీ పార్టీని తుధ ముట్టించేందుకు టీడీపీ కార్యకర్తలు నాయకులు కంకణ బదులుగా ఉండాలన్నారు. లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందన్నారు.

CM Revanth: ప్రజా దీవెన సభలో కేసీఆర్ పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్..

కనుక విభేదాలను పక్కనపెట్టి విజయం సాధించి ఉదయగిరిపై తెలుగుదేశం జెండాను ఎగరవేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకొని.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బొల్లినేని వెంకట రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ పొన్నుబోయిన బాబు యాదవ్, మాజీ ఏఎంసి చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ సీమకుర్తి రవీంద్రబాబు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు దంతులూరు వెంకటేశ్వరరావు, యారం కృష్ణయ్య, కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం, ఉదయగిరి కన్వీనర్ బయన్న, వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, కోడూరు నాగిరెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, అభిమానులు, తదితరులు ఉన్నారు.