Sherika De Armas Died: మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ కన్నుమూశారు. 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించింది. న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, షెరికా డి అర్మాస్ గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయి అక్టోబర్ 13న 26 ఏళ్ల వయసులో మరణించారు. డి అర్మాస్ కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్స చేయించుకున్నారు. షెరికా డి అర్మాస్ మరణ వార్త ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉరుగ్వే తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ శోక సంద్రంలో మునిగిపోయారు. ఆమె సోదరుడు, మాయక్ డి అర్మాస్ సోషల్ మీడియాలో తనను ఎప్పటికీ మర్చిపోలేమంటూ రాసుకొచ్చాడు. మిస్ యూనివర్స్ ఉరుగ్వే 2022 కార్లా రొమెరో తన సంతాపాన్ని తెలియజేసింది.
Read Also:AP High Court: సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు
మిస్ ఉరుగ్వే 2021 లోలా డి లాస్ శాంటోస్, డి అర్మాస్‌కు నివాళులర్పిస్తూ, నేను నిన్ను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను, మీరు నాకు ఇచ్చిన మద్దతు మర్చిపోలేదన్నారు. 2015లో చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో 26 ఏళ్ల షెరికా డి అర్మాస్ పోటీదారు. తను పోటీ చేసిన ఆరుగురు 18 ఏళ్ల అమ్మాయిలలో ఒకరిగా ఉన్నారు. ఆమె తన సొంత మేకప్ లైన్‌ను ప్రారంభించింది. షే డి అర్మాస్ స్టూడియో పేరుతో జుట్టు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయించింది. మోడల్ తన సమయాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేసే పెరెజ్ స్క్రీమిని ఫౌండేషన్‌కు అంకితం చేసింది.
Read Also:Health Tips : నడుం నొప్పితో భాధపడుతున్నారా? మీ కోసమే ఈ ఆసనాలు…