Site icon NTV Telugu

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎంని కలిసిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి.. ఎందుకంటే?

Bhatti

Bhatti

హైదరాబాద్ నగరంలోని ఘాట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ పనులు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని వివరించారు. రోజూ ట్రాఫిక్ జాంలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల పనులను వేగంగా పూర్తిచేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సందర్భంలో 50 లక్షల రూపాయలు మంజూరు చేయడంపై మల్లారెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి అధికారులతో చర్చించిన భట్టి విక్రమార్క, పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.

READ MORE: Mamata Banerjee: లండన్‌లో సీఎం మమత చీర, చెప్పులతో జాగింగ్.. వీడియోలు వైరల్

Exit mobile version