Site icon NTV Telugu

RK Roja: హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి.. మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు..!

Rk Roja

Rk Roja

RK Roja: ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్న పరిస్థితిని ఆమె ఆవేదనతో వివరించారు. హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై మండిపడుతూ.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పుడు మహిళలకు రక్షణే లేదు. హోంమంత్రి అనిత మహిళలను కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి హోంమంత్రి పదవి ఆమె ఎందుకు చేపట్టారు..? మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా.. జగన్, భారతీ లని విమర్శించేందుకే ఆ పదవిని తీసుకున్నారా..? అంటూ రోజా తీవ్ర విమర్శలు చేశారు.

Read Also: Raghurama Krishna Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. సజ్జలపై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..!

అలాగే ఆమె అనంతపురం జిల్లా ఘటనను ప్రస్తావిస్తూ.. ‘అక్కడ మైనర్ బాలికపై నెలల తరబడి 14 మంది టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటనకు కారణం కూటమి ప్రభుత్వమే. అయినా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. బాధితులకు న్యాయం లభించడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడాన్ని రోజా తప్పుపట్టారు. మహిళలపై హింస పెరిగినా, పవన్ స్పందించడం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ ముగ్గురూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించకుండానే నిద్రపోతున్నారు. మౌనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Janmabhoomi Express : తెలంగాణలో తప్పిన పెను ప్రమాదం.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు ఇంజిన్ బ్రేక్‌డౌన్

ఇక ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పై పెట్టిన కేసులపై కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్ర ప్రజల మనసులో నిలిచిపోయేలా నిజాలను మాట్లాడే జర్నలిస్టు. అలాంటి వ్యక్తిపై అక్రమంగా కేసులు పెట్టడం బాధాకరం. ఇది మీడియా స్వేచ్ఛపై దాడి అని అభిప్రాయపడారు.

అలాగే కొమ్మినేని చాలా గోప్పవ్యక్తి అని, ఆయనపై కేసు పెట్టడం దారుణం అంటూ ప్రస్తావించారు. జగన్, భారతీ క్షమాపణలు చెప్పాలని కూటమీ నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదమని అన్నారు. రేణుకా చౌదరీ జగన్ ను దారుణంగా దూషించారు. వారిపై కేసులు ఎందుకు పెట్టేదని ఆవిడ ప్రశ్నించారు. కృష్ణంరాజు మాట్లాడినా మాటలు తప్పు. కొమ్మినేని పై చంద్రబాబు, లోకేష్ కు ఎప్పటినుంచో కక్ష.. అ వ్యాఖ్యలకు సాక్షి సంస్థకి సంబంధం లేదు. ప్లాన్ ప్రకారం కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చేశారు. నన్ను బండారు సత్యనారాయణ భూతులు తిట్టారు‌‌. ఆయన పై ఎందుకు కేసులు పెట్టలేదు‌ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Exit mobile version