NTV Telugu Site icon

Niranjan Reddy: ఫోన్ ట్యాపింగ్.. లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్

Niranjan Reddy

Niranjan Reddy

ప్రజల దృష్టి మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ను తెర పైకి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సర్కస్లో జోకర్గా అవసరం అయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంను తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటి వరకు సీఎం, మంత్రులు మాట్లాడలేదు.. కానీ లీకులు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టపరంగా జరగాల్సింది జరుగుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తారు.. నిర్ధారణ చేస్తారా? అని ప్రశ్నించారు. ట్యాపింగ్ పరికరాలు ధ్వంసం చేసి మూసీ నదిలో వేస్తే.. సీఎం, మంత్రులు ఈదుకుంటూ వెళ్లి తీసుకువస్తారా? అని దుయ్యబట్టారు. ఇందిరా గాంధీ సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనీ ఆరోపణలు ఉన్నాయని.. అది కాన్ఫెషన్ స్టేట్మెంట్.. ఎవిడెన్స్ కాదు అని అందరికీ తెలుసని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Sithara Ent: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలోనూ అదే ఫాలో అవుతున్న నాగవంశీ!

ఫోన్ ట్యాపింగ్.. లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్ అని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని విమర్శించారు. లైవ్ లో దొరికిన రేవంత్కు లై డిటెక్టర్ పెడితే ఎలా ఉంటుంది ? అని ప్రశ్నించారు. కేసీఆర్కు లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయని రేవంత్ మాట్లాడడం అవివేకం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వారిని అలా మాట్లాడతారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

kidney Operation: ఎడమ కిడ్నీ బదులు, కుడి కిడ్నీ తొలగింపు.. మహిళ పరిస్థితి విషమం..

మరోవైపు.. రాష్ట్రంలో కరెంటు, నీళ్ళు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. వరికి బోనస్ మీద తల తోక లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన వరికి బోనస్.. బోగస్ మాత్రమేనని విమర్శించారు. ఇచ్చిన బోనస్ ఏంటి అంటే.. రైతుల మీద లాఠీ ఛార్జ్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో విత్తనాలు లేక రైతులు ఇబ్బందులు పడలేదని.. కాంగ్రెస్ నేతలకు పాలన దక్షత ఉందా లేదా అన్నది ప్రజలు ఆలోచించాలని నిరంజన్ రెడ్డి కోరారు.