Sithara Entertainments Crucial Decision: సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. అదేమంటే సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన రోజే మీడియాకి ఒక స్పెషల్ షో అరేంజ్ చేస్తారు. ఎల్వీ ప్రసాద్ ల్యాబ్స్ లో కానీ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కానీ లేదా ఇటీవల వచ్చిన ఏఎంబీ, త్రిబుల్ ఎ వంటి మల్టీప్లెక్స్ లలో వారికి రిలీజ్ రోజు ఉదయం కానీ ముందు రోజు రాత్రి గాని స్పెషల్ షోలు వేసేవారు. అయితే గుంటూరు కారం సినిమా విషయంలో మీడియా మీద కాస్త అలిగిన నాగ వంశీ ఆ తర్వాత సంస్థ నుంచి వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాకి స్పెషల్ షోలు ఏమీ వేయించలేదు. రిలీజ్ తర్వాత రోజు మీడియా ఫ్యామిలీస్ కి ఒక షో ప్లాన్ చేశారు.
Girlfriend For Rent: ఇండియాలో గర్ల్ ఫ్రెండ్ ఫర్ రెంట్.. రెండు రోజులకు పది వేలే.. కానీ?
ఇప్పుడు కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయంలో అదే పద్ధతి ఫాలో అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా 31వ తేదీ రిలీజ్ అవుతుంది. కానీ ఆ రోజు షోస్ వేయకుండా ఒకటవ తేదీన మీడియా ఫ్యామిలీస్ కోసం ఒక షో ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కించారు. గతంలో రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా సినిమాలను డైరెక్ట్ చేసిన కృష్ణ చైతన్య ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. త్రివిక్రమ్ శిష్యుడు కావడంతో డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దానికి తోడు సినిమా టీజర్, ట్రైలర్ కట్స్ బాగుండడంతో ఈవారం విడుదలవుతున్న సినిమాలలో ఈ సినిమాకి ఎక్కువ బజ్ వినిపిస్తోంది.