NTV Telugu Site icon

Niranjan Reddy: రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మమ్మల్ని జనం అడుగుతున్నారు..

Niranjan Reddy

Niranjan Reddy

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన తెలంగాణ భ‌వ‌న్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూతలు… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు అని విమర్శించారు. మరోవైపు.. రైతుబంధు ఎప్పుడు ఇస్తారని జనం తమను అడుగుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంతా చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. 2018 కంటే ముందు మిగిలిన వ్యవసాయ రుణమాఫీ ఏం చేస్తరని కాంగ్రెస్ ప్రభుత్వంను అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇస్తారా ? ఇవ్వరా ? చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా మాఫీ చేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదని తెలిపారు. రైతుల రుణాల వివరాలు చెప్పాలి.. ఎందుకు దాచి పెడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు.

Asaduddin Owaisi: ఓవైసీ ప్రమాణస్వీకారం.. లోక్‌సభలో దుమారం..

రాష్ట్రంలోని అన్నదాత‌ల‌కు ఈ వ‌ర్షాకాలం నుంచే రైతు భ‌రోపా ప‌థ‌కం అమ‌లు చేయాలని కోరారు. రైతుల‌కు వెంట‌నే ఎక‌రానికి రూ. 7500 సాయం అందించాలన్నారు. కౌలు రైతుల‌కు రైతు భ‌రోసా ఇస్తారా..? లేదా..? రైతు కూలీలకు 12 వేలు ఇస్తారా ? కౌలు రైతులకు 15 వేలు ఇస్తరా.. లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. మహాలక్ష్మి పథకం ఏమైంది ?.. రేష‌న్ కార్డులు లేనివారికి కొత్తవి ఇస్తామ‌ని చెప్పారు. ఇప్పుడేమో అన్ని కొత్త రేష‌న్ కార్డులు ఇస్తామంటున్నారని నిరంజన్ రెడ్డి పేర్కన్నారు. ఏం చేయకుండానే రేవంత్ ప్రభుత్వం ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుందని ఆరోపించారు. రుణ‌మాఫీ చేసిన‌ట్టే సంబురాలు చేసుకోవ‌డం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

Thaman – Sree Leela: తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గ గిల్లిన తమన్

మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై స్పందిస్తూ, ఆ ఇంటి కాకి.. ఈ ఇంటి మీద వాలితే కల్చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారని.. మరి ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి రేవంత్ ఎందుకు కండువా కప్పుతున్నారు.. కౌగిలించుకుంటున్నారని ప్రశ్నించారు. కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే.. తెలంగాణ సోయి ఎక్కడ పోదని పేర్కొన్నారు. తమ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు పోతే నష్టం ఏమి లేదని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా.. పోయినా బీఆర్ఎస్ తన పాత్ర పోషిస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు.