NTV Telugu Site icon

KTR: “అవును నాకు మహిళా కమిషన్ నుంచి నోటీసు వచ్చింది”

Ktr

Ktr

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క.. ‘బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కూతలు అల్లికాలు చేసుకుంటే తప్పేంటీ’ అని ప్రశ్నించారు. దానిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు.. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని సమాధానమిచ్చారు. దీంతో మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మహిళా కమీషన్ పేర్కొంది. తెలంగాణ మహిళలను కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్న కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళ శారద, కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై కేటీఆర్ తాజాగా స్పందించారు. తెలంగాణ భవన్ లో మీటింగ్ అనంతరం ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో ఆయన నోటీసు వచ్చినట్లు స్పష్టం చేశారు.

READ MORE: Fauji : ఆజాద్ హింద్ ‘ఫౌజీ’గా ప్రభాస్.. ఇదే స్టోరీ లైన్?

“నాకు మహిళా కమిషన్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. నేను మహిళా కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాను. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళల పై జరిగిన దాడి వివరాలు కూడా అందిస్తాను. చెప్పిన విధంగానే 24 వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్తాను.” అని మాజీ మంత్రి స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలు మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని తెలిపారు. నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదని కేటీఆర్ అన్నారు. బస్సుల్లో సీట్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఇంకా బస్సులను పెంచాలనే ఉద్దేశంతో అన్నానని తెలిపారు. నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం తనకులేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరారు.