Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేశ్ అమరావతి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణమే అంటూ చెప్పారు. ఎన్టీవీతో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులు తీసుకువచ్చారు. కానీ అమరావతి ప్రజలకు అది నచ్చలేదు. అమరాతి కూడా మా ఓటమికి ఒక కారణమే. ఈ విషయాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తాం. జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు. ఆయన సీఎం అయితే అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారు.
Read Also : Kakani Goverdhan Reddy : ముగిసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణ..
మా నాయకుడు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. చంద్రబాబు కూడా మేం చెప్పినట్టే విశాఖ ఆర్థిక రాజధాని అంటున్నారు. మేం ఆశించినట్టే ఇప్పుడు విశాఖను ఒక రాజధానిగా కూటమి ప్రభుత్వం చేసింది. అక్కడ కూడా పెట్టుబడులు వచ్చి అభివృద్ధి చేయాలన్నదే మా పార్టీ ఉద్దేశం. ఇదే విషయాన్ని జగన్ చాలా సార్లు చెప్పారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావొద్దన్నదే జగన్ ఉద్దేశం. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని ఆయన చూశారు’ అంటూ చెప్పుకొచ్చారు జోగి రమేశ్.
Read Also : Satyakumar Yadav : ప్రతి ఒక్కరి సంక్షేమమే బీజేపీ ధ్యేయం.. మంత్రి సత్యకుమార్ యాదవ్..