గవర్నర్ తమిళిసై పై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేశారు. సిద్ధిపేటలో రూ.5 లక్షలతో నిర్మించే ఏకలవ్యమిత్ర మండలి భవనానికి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా ఎరుకలి కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణకి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.. కానీ గవర్నర్ మాత్రం ఆమోదించకుండా ఏ విధంగా అన్యాయం చేశారో అందరికీ తెలుసని ఆరోపించారు. కేసీఆర్ చేసిన దానిని రిజెక్ట్ చేసే అధికారం లేదని కోర్టు చెప్పింది.. హైకోర్టు ఈ విషయాన్ని పునర్ పరిశీలించాలని చెప్పిందని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: TS Congress: పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం..
అంతకుముందు.. చిన్నకోడూర్లో 300 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను హరీష్ రావు పంపిణి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది.. అనాలోచితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత ఎండాకాలం ఈ సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించి చెరువుల్ని, కుంటల్ని, చెక్ డ్యామ్ లను నింపుకున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయమే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ప్రచారం చేస్తూ నీళ్లు విడుదల చేయడం లేదని తెలిపారు. నీళ్లు అందక రైతులు కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Bus Catches Fire: ఘోర ప్రమాదం.. విద్యుత్ తీగలు తగిలి బస్సు దగ్ధం, పలువురు మృతి