NTV Telugu Site icon

Harish Rao: మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్కి చూపెట్టింది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా..

Harish Rao

Harish Rao

తెలంగాణ భవన్ లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ కి చూపెట్టింది ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు అసలు సినిమా ఉంటది అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ లో మొదటిసారిగా సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగానే విమర్శలు చేసింది. అయినప్పటికీ సీఎం, మంత్రులు ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

Read Also: Congress Meeting: రాబోయే పార్లమెంటు ఎన్నికల విధివిధానాలపై చర్చ జరిగింది..

కాగా.. ఈరోజు జరిగిన సమావేశంలో నేతలకు హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. ఎంపీ ఎన్నికల్లో అందరం కష్టపడాలి.. మీరు చెప్పిన అంశాలు ప్రతిదీ చర్చిస్తామన్నారు. నెల అయితే కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ లో ఉంటారు.. అందరం ఇక్కడే ఉంటామని తెలిపారు. ఏ ఒక్కరికీ సమస్య వచ్చినా.. అందరం బస్ వేసుకొని మీ ముందుకు వస్తామని చెప్పారు. మరోవైపు.. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.. వారిది వారికే పడటం లేదని విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. అంతేకాకుండా.. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం.. అవసరమైన వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. అక్రమ కేసుల నుండి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం.. జిల్లా కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.

Read Also: Ram Temple Event: “మోడీకి వ్యతిరేకం కాదు, కానీ”.. రామ మందిర వేడుకలకు హాజరుకాబోమన్న ఇద్దరు శంకరాచార్యులు..