Site icon NTV Telugu

Balineni Srinivasa Reddy : అందులో పెట్టుబడులు నేను పెట్టలేదు.. నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా

Balineni

Balineni

Balineni : మైత్రీ మూవీస్ లో నేను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవం అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరినీ ప్రశ్నిస్తా అంటున్న పవన్ కళ్యాణ్ ను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. పవన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత లందరినీ అడిగి తెలుసుకోండి..
మైత్రీ మూవీస్ లో నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సహకరిస్తే మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు పెట్టినట్లా.. వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరం అయితే సహకరిస్తానంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Also Read : Vishal: బోయపాటి రేంజ్ దర్శకుడితో విశాల్ సినిమా…

వైజాగ్ లో మా కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు.. అవాస్తవాలు చేయటం మీకు సరికాదు.. ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. మైత్రీ మూవీస్ లో కానీ, వైజాగ్ భూకబ్జాతో కానీ సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్దం.. మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే పెడుతున్నారో అందరికీ తెలుసు అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజల్లో ఆదరణ ఉందని బురద చల్లాలని చూస్తున్నారు.. ఈ విషయంలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి.. సంబంధం లేకుండా అభియోగాలు చేస్తున్నారు.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Also Read : Gidugu Rudra Raju : కేంద్ర, రాష్ట్ర సర్కార్ లపై ఏపీసీసీ చీఫ్ ఫైర్

Exit mobile version