Vishal: బోయపాటి రేంజ్ దర్శకుడితో విశాల్ సినిమా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో ఓవర్ ది టాప్ మాస్ కమర్షియల్ సినిమా చెయ్యాలి అంటే అది బోయపాటి శ్రీనుకే సాధ్యం. ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను సినిమా వస్తుంది అంటే చాలు హీరో ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి మరీ బీ, సీ సెంటర్ల ఆడియన్స్ థియేటర్స్ కి క్యు కడతారు. తెలుగులో బోయపాటి రేంజ్ కమర్షియల్ సినిమా చేసే దర్శకుడు మరొకరు లేరు కానీ తమిళ్ లో మాత్రం ఒకరు ఉన్నారు. మాస్ సినిమాలని రీడిఫైన్ చేసిన ఆ దర్శకుడి పేరు ‘హరి’. సూర్యతో ఆరు, సింగం, సింగం 2, దేవ సినిమాలు చేసిన హరికి కోలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా పేరుంది. మాస్ సినిమాలని మాత్రమే చేసే ఈ దర్శకుడు, తన నెక్స్ట్ సినిమాని సూర్యతో సింగం 3 తీస్తాడు అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ విశాల్ తో సినిమా అనౌన్స్ చేశాడు. విశాల్ తో ఇప్పటికే భరణి, పూజ సినిమాలు చేశాడు హరి. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు విశాల్ కి మంచి హిట్స్ గా నిలిచాయి.
శృతి హాసన్ నటించిన ‘పూజ’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రెండు హిట్స్ కొట్టిన విశాల్-హరిలు ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యారు. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్ హౌజ్ అయిన స్టోన్ బెంచర్స్ మరియు జీ స్టూడియోస్ సౌత్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ‘విశాల్ 34’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ పోస్టర్ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఒక వైపు స్తెత్తస్కోప్ ఇంకో వైపు కత్తులు, గన్నులు ఉన్నాయి. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే ‘విశాల్ 34’ మెడికల్ మాఫియాకి చెందిన కథగా కనిపిస్తోంది. మరి విశాల్, హరి కలిసి మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Also Read
#Vishal34 – Puratchi Thalapathy @VishalKOfficial & #Hari team up for a #BigAction entertainer
Shoot begins soon !!
Produced by @stonebenchers & @ZeeStudiosSouth@kaarthekeyens @karthiksubbaraj pic.twitter.com/YZsNPy3ecY
— Vishal Film Factory (@VffVishal) April 23, 2023
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!