Former DC Chairman Venkatarami Reddy arrested: డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకట్రామి రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. హవాలా, మనీలాండరింగ్ కేసులో వెంకటరామి రెడ్డిని ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. రుణాల ఎగవేత ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో రూ. ఆయనపై ఉన్న 3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పెద్ద మొత్తంలో రుణాలు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. డీసీ వెంకట్రామి రెడ్డి వివిధ బ్యాంకుల నుంచి 8,800 కోట్ల రుణాలు తీసుకున్నారు.
వాటిని మళ్లీ కట్టడంలో విఫలమవడంతో ఈడీ దాడులు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. మంగళవారం డీసీ వెంకట్రామిరెడ్డి, గతంలో సీఈవోగా పనిచేసిన మణి అయ్యర్‌లను కూడా పిలిపించి విచారించారు. వీరితో పాటు మరో వ్యక్తిని కూడా పిలిపించారు. ఈ ముగ్గురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. రిమాండ్‌కు పంపనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
2015లో ఫిబ్రవరి 15లో కూడా డక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామి రెడ్డిని బెంగళూరు సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తప్పుడు డాక్యుమెంట్లతో వెంకట్రామి రెడ్డి తమను రూ.357 కోట్ల మేర మోసం చేశారంటూ సీబీఐకి కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఫిర్యాదుపై విచారణ జరిగింది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించారు. అనంతరం అరెస్టు చేశారు. కాగా, వెంకట్రామి రెడ్డి అరెస్టు సరికాదని, ఒప్పందం పోరాడుతామని డెక్కన్ క్రానికల్ పేర్కొంది.
Yogini Ekadashi: యోగిని ఏకాదశి నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి